రైతుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యా యని సీపీఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ చెప్పారు. తాడిపత్రిలోని వ్యవసాయ కార్యాలయం ఎదుట ఆయన నిరసన చేపట్టారు. రైతులకు యూరియా దొరకక బారులు తీరుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అధికారంలోకి రాకముందు రైతే రాజు రైతు లేనిదే రాజ్యం లేదంటూ గొప్పలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం దారుణమని విమర్శించారు.