బైరెడ్డిపల్లి: మండల స్థానికులు మంగళవారం తెలిపిన సమాచారం మేరకు, బాపలనత్తం గ్రామానికి చెందిన పురుషోత్తం అనే 30సంవత్సరాల యువకుడు నక్కనపల్లి గ్రామం వద్ద మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108 ఆసుపత్రి వర్గాలకు సమాచారం అందించి బైరెడ్డిపల్లి పీహెచ్సీకి తరలించి వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.