కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ట్రాఫిక్ ACP యాదగిరి స్వామి ఆధ్వర్యంలో అర్ధరాత్రి వరకు వాహనాల తనిఖీలు నిర్వహించినట్లు శనివారం ఉదయం ట్రాఫిక్ ఏసిపి తెలిపారు.నెంబర్ ప్లేట్ లేని వాహనాలు,మధ్యం సేవించి వాహనాలను నడిపే వంద మందికి పైగా వాహనదారులకు ఈ చాలన్ వేశారు. భారీగా చలానాలు ఉన్న వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు.చిన్న పిల్లలకి లైసెన్స్ లేకుండా వాహనాలను ఇవ్వకూడదని అన్నారు.ట్రాపిక్ నియమాలను పాటించి పోలీసులకు సహాకరించాలని కోరారు.