Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 11, 2025
గుడ్లూరు ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న ఆటోను అటుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆటో వద్ద నిలబడి ఉన్న ఇద్దరు మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను గుడ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఓ మహిళ చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. మరొకరు వైద్యం పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగింది.