మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ధనాల వెంకట్రావు, సిఐటియు జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్లు అన్నారు. గురువారం తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.