చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండులో వైయస్సార్ 16వ వర్ధంతి సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషా , మున్సిపల్ చైర్మన్ మంగళవారం ఉదయం 10.30 నిమిషాల ప్రాంతంలో మాట్లాడుతూ పేద ప్రజలకు రైతులకు. మైనారిటీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని. పేద ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకం. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను మహనీయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప, ఎంపీపీ భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.