అనకాపల్లి సబ్-డివిజన్ పరిధిలోని చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైలపూడి గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 13 మోటార్ సైకిళ్లు, 1 ఆటో, 2 కార్లు శనివారం స్వాధీనం చేసుకున్నారు. బైలపూడి గ్రామంలో గంజాయి కేసుల్లో 38 మంది సస్పెక్ట్ షీట్ హోల్డర్లు, 92 మంది నిందితులు ఉన్నారని, వారిపై కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారని, గత ఏడాది కాలంలో 11 మందికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించబడిందని, ఇద్దరిపై ఫైనాన్షియల్ ఇన్వెస్టి