ముదిరాజ్ ల సమస్యలు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ముదిరాజ్ లకు బిసి డి నుంచి బిసి ఎ లోకి మార్చాలని స్థానిక అంబెడ్కర్ కళాభవన్ లో తెలంగాణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా గర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ముదిరాజ్ రిజర్వేషన్ సమస్యను గత ప్రభుత్వం పట్టించుకోకుండా విస్మరించిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నారాయణ పేట వేదిక గా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గార