సిరిసిల్ల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఎమర్జెన్సీ, ఐసీయూ, మెటర్నటీ, ఆర్థోపెడిక్, మెల్ వార్డులలో అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం పలువురు రోగులతో మాట్లాడారు. ఏ అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వచ్చారని, ఇక్కడ సేవలు ఎలా అందుతున్నాయో ఆరా తీశారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి రోగికి సేవలు అందించాలని సూచించారు. తంగళ్ళపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో ఫీవర్ సర్వే చేయాలని జిల్లా అధికారి రజి