గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో CM రేవంత్ రెడ్డి మాదాపూర్ శిల్పకళా వేదికలో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా టీచర్లతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని స్మరిస్తూ పుష్పాంజలి ఘటించారు. విద్యార్థులను తీర్చిదిద్దుతోన్న ఉపాధ్యాయుల సేవలను ఆయన కొనియాడారు.