ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో బేళ్ళ తిరస్కరణ సంఖ్య ఎక్కువగా ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం అమ్మకానికి 981 బేల్లు తీసుకురాగా వాటిలో 624 బేళ్ళ మాత్రమే కొనుగోలు చేశారు. 357 బేళ్ళు కొనుగోలుచేయకుండా తిరస్కరించారు. పదవ రౌండ్ జరుగుతున్నప్పటికీ తిరస్కరణ సంఖ్య తగ్గట్లేదు. రైతులు వేలం కేంద్రానికి తీసుకువచ్చిన పొగాకు బేళ్ళు తిరిగి ఇంటికి తీసుకు వెళ్లాలంటే భారమని రైతులు వాపోతున్నారు.