గణపతి విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు. 5వ రోజు తర్వాత నుంచి నిమజ్జన, శోభాయాత్రలు జరిగే నేపథ్యంలో జిల్లా ఎస్పీ నరసింహ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. నిమజ్జనాలు ఎక్కడ చేయాలో ముందుగానే ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు పెంచాలని ఆదేశించారు.