ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో హైదరాబాద్ , అసెంబ్లీ ముట్టడికి వెళ్లడానికి సిద్ధమవుతున్న ఆశా కార్యకర్తలను ఎడపల్లి పోలీసులు ముందుస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు, ఈ సందర్భంగా రాష్ట్ర ఆశా వర్కర్ల యూనియన్ ఉపాధ్యక్షురాలు రాజామణి మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ ముట్టడి ఉండడం వలన పోలీసులు రాత్రికి రాత్రే మహిళలని చూడకుండా ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచేటు కార్యక్రమం అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు, మా న్యాయమైన సమస్యలైనా కనీస ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.