షార్ట్ సర్క్యూట్ తో టెంపోలో మంటలు శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఆటోనగర్ లో ఆగి ఉన్న టెంపుల్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటనా చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు భారీగా వ్యాపించడంతో టెంపో ఇంజన్ భాగం కాలిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడానికి స్థానికులు ప్రయత్నం చేస్తూ, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు. కెంపు ఇంజన్ భాగంలో పూర్తిగా కాలిపోవడంతో యజమానికి భారీగా నష్టం వాటిల్లింది.