విజయనగరం జిల్లా వంగర ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ సురేష్ ముఖర్జీ అధ్యక్షతన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రజలకు సేవలు అందించడంలో రెవెన్యూ అధికారులు విఫలమవుతున్నట్లు ప్రజా ప్రతినిధులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లంచం ఇస్తే గానీ పనులు జరగటంలేదని, ప్రజలు రోజుల తరబడి రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారన్నారు. సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎంపీపీ ఆదేశించారు