ఇన్స్టాగ్రామ్ పరిచయమై, ప్రేమగా మారి పెళ్లి చేసుకున్న తనను భర్త వదిలేశాడని నంబూరుకు చెందిన ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ఎస్పీ సతీష్ కుమార్ కి ఫిర్యాదు చేసింది. సంవత్సర కాలంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఆమె కన్నీరు పెట్టుకుంది. తన భర్త తనను కాదని మరో యువతితో ఉంటున్నాడని, తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంది. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా ఆమె వివరించారు.