రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని గాలికి వదిలేసిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ మండిపడ్డారు. విద్యా రంగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో కిరణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ర్యాంకులు ఇస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి విద్యార్థి సంఘాలుగా 100 కి 35 మార్కులు కూడా ఇవ్వలేం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విద్యారంగ సమస్యలు నెలకొన్నాయి అని తెలిపారు.