యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం ఆలయ ప్రధానార్చకులు శ్రీ లక్ష్మీనరసింహచార్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్సవ మండపంలో సుదర్శన నరసింహ హోమం అనంతరం వేదమంత్రోచరణలు, మంగళ వాయిద్యాల మధ్య లక్ష్మీ నరసింహని కళ్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనం, మాంగల్య ధారణ, తలంబ్రాల కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.