జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. ఈరోజు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సత్యాగ్రహమే ఆయుధంగా శాంతి, అహింసా మార్గాల్లో దేశానికి స్వాతం త్య్రం సాధించిన మహనీయుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు. ప్రతీ ఒక్కరం ఆయన చూపిన మార్గంలో పయనించి సమాజా భివృద్ధికి పాటుపడాలని అన్నారు.