బాపట్ల జిల్లాలో లబ్ధిదారులందరికీ అధునాతన రైస్ కార్డులు అందజేయాలని ఇన్ఛార్జి సంయుక్త కలెక్టర్ గంగాధర్ గౌడ్ పౌర సరఫరాల అధికారులకు తెలిపారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్లో ఆయన ఈ-పాస్ మిషన్ను రైస్ డీలర్లకు అందజేశారు. జిల్లాలోని 4,71,382 మంది లబ్ధిదారులకు కొత్త అధునాతన రైస్ కార్డులను అందజేయడానికి 1,123 ఈ-పాస్ మిషన్లు సరఫరా చేశామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులకు అందజేయాలన్నారు.