బాపట్ల రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హైకోర్టు న్యాయవాది జనార్దన్ రావు చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందారు.ద్విచక్ర వాహనంపై వస్తున్న జనార్దన రావును ఒక ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్కూల్ బస్సుల అధిక వేగం కారణంగా ఇలాంటి ప్రమాదాలు తరచూ బాపట్లలో జరుగుతున్నాయి.