హుజూర్‌నగర్ పట్టణంలో వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ముగ్గురు మహిళలను, ముగ్గురు విటులను అరెస్ట్ చేసినట్లు సీఐ చరమంద రాజు తెలిపారు. ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని అందిన సమాచారం మేరకు, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని అన్నారు. వ్యభిచారంలో పట్టుబడిన వ్యక్తులు కోదాడ, ఖమ్మంకు చెందినవారని గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.