గోనెగండ్ల మండలం నుంచి ముగ్గురు ఉత్తమ టీచర్లుగా ఎంపిక..సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. గోనెగండ్ల మండలంలో సేవలందిస్తున్న ముగ్గురు జిల్లా ఉత్తమ ఉపాధ్యా యులుగా ఎంపికయ్యారు. వారిలో బసవరాజు, శోభాదేవి, ఫర్హీన్ ఉన్నట్లు గోనెగండ్ల మండల విద్యాశాఖ అధికారి-2 నీలకంఠ తెలిపారు. వీరిని జిల్లా ఉన్నతాధికారులు అవార్డుతో ఘనంగా సత్కరించనున్నారని పేర్కొన్నారు.