నాగులుప్పలపాడు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని బిజెపి నాగులుప్పలపాడు మండల అధ్యక్షురాలు అపర్ణ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా ఒంగోలులో నిర్వహించిన ధర్నా కార్యక్రమం అనంతరం సోమవారం సాయంత్రం అపర్ణ మీడియాతో మాట్లాడుతూ.... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి పై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎందుకు స్పందించలేదని అపర్ణ ప్రశ్నించారు. మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.