శ్రీశైలం మండలం సున్నిపెంటలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా తీవ్రమైన ఎండ ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం లభించింది .బుధవారం మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వర్షం కురవడంతో ,వాతావరణం చల్లగా మారి వర్షం కురిసింది .దీంతో సున్నిపెంట ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా తీవ్రమైన ఉక్కుపోతా ఎండతో ఇబ్బందులు పడ్డ వారికి కాస్త ఉపశమనం లభించింది.