చీమకుర్తి : పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన మహోన్నత నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని చీమకుర్తి సీఐ సుబ్బారావు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి దివంగత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని చీమకుర్తిలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ వద్దగల టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి సిఐ సుబ్బారావు స్థానికులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రిగా పేద, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ప్రకాశం పంతులు కృషి చేశారని, ఆయన నిస్వార్ధ నాయకుడని సీఐ కొనియాడారు.