నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లో గల శ్రీ లింబాద్రి గుట్ట లక్ష్మి నరసింహ స్వామి ఆలయం లో శనివారం ను పురస్కరించుకొని వేదంపండితులు ఉదయం నుండి స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపి అలంకరించి భక్తులకు దర్శింపజేశారు.. గోవిందా నామస్మరణతో ఆలయ ప్రాణంగాణమంత మారుమ్రోగింది. శనివారం సందర్బంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.కారేపల్లి కి చెందిన మహిళలు ఏకరూప దుస్తులు ధరించి, తమగ్రామం నుండి కాలినడకన వచ్చి మొక్కులు మొక్కుకున్నామని ఇలా అయిదు వారలు నడిచివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లిష్టమన్నారు.