ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలన్న విషయమై పార్టీ అధిష్టాన వర్గం పంపిన ముగ్గురు పరిశీలకులు ఆదివారం ఆ కసరత్తు పూర్తి చేశారు.మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పార్టీ సీనియర్ నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు,కనపర్తి సురేష్ లు ఒంగోలులో ఉదయం 11 గంటల సమయంలో జరిగిన విస్తృత సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలోని మంత్రి ఎంపీ,ఎమ్మెల్యేలు,పార్టీ ఇన్చార్జీలు, సీనియర్ నాయకుల అభిప్రాయాలను వారు సేకరించారు.పార్టీ అధిష్టానానికి తమ నివేదిక అందజేస్తామని పరిశీలకులు చెప్పారు.