రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వీసీ, రిజిస్ట్రార్ల కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తల సంఘం డిమాండ్ చేసింది. శాస్త్రవేత్తలపై జరుగుతున్న వేధింపులకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.