కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై కనిగిరి మున్సిపల్ కమిషనర్ పిల్లి కృష్ణమోహన్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.... మన గ్రామాలను మనమే బాగు చేసుకోవాలని, ఎవరో వచ్చి బాగు చేయరని విద్యార్థులకు తెలిపారు. ప్లాస్టిక్ కవర్లను ప్రతి ఒక్కరు నిషేధించాలని, ఇప్పటికి బదులు గుడ్డ లేదా జనపనారతో తయారుచేసిన సంచులను వినియోగించాలని విద్యార్థులకు కమిషనర్ సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చని కమిషనర్ సూచించారు.