అనంతపురంలో జరగనున్న "సూపర్ సిక్స్ - సూపర్ హిట్" విజయోత్సవ సభ ప్రాంగణాన్ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు పరిశీలించారు.ఈ సందర్బంగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నాయకులను కలిసి సభ విజయవంతం కావడానికి చేపట్టిన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. సభలో పాల్గొనబోయే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా అధికారులు, నిర్వాహకులకు సూచనలు చేశారు.