సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా శ్రీరంగాపురం పీహెచ్సీ వైద్యాధికారి ఎం. రవిశంకర్ పేర్కొన్నారు. సోమవారం బెలుగుప్ప మండల పరిధిలోని ఎర్రగుడి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ ను పరిశీలించి రోగులకు చికిత్సలు అందించారు. వర్షాకాలం అయినందువల్ల సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలి అవకాశం ఉందని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రైడే పాటించాలని అవగాహన కల్పించారు.