నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో చాకలి ఐలమ్మ 4వ వర్ధంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ భూస్వాములు పెత్తందారులు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత ఐలమ్మ అని అన్నారు. వెట్టి చాకిరి కి వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకెళ్లాలన్నారు. రజాకా ఆగడాలను వారి దౌర్జన్యాలను ఎదిరించి పేద బడుగు వర్గాలను కాపాడిన వీరనారి 40 వర్ధంతి అని జోహార్లు అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.