నరసరావుపేట 26 వార్డులోని రాజీవ్ గృహకల్ప ఇళ్ళకు 5 రోజులకు ఒకసారి మంచినీరు ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇంటికి 200 రూపాయల వసూలు చేస్తూ కనీసం మోటర్ కూడా వేయడం లేదన్నారు. వృద్ధులు 3ఫ్లోర్ కు మంచినీరు మోసుకొని వెళుతున్నారని తెలిపారు. డ్రైనేజీ లేదని,పాములు,దోమలతో రాజీవ్ గృహకల్ప అడవిని తలపిస్తుందన్నారు.