గాజాలో మారణకాండను కొనసాగిస్తున్న ఇజ్రాయిల్ భారత ప్రభుత్వం చేసుకున్న వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవాలని పౌర ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ మంత్రి భారత ప్రభుత్వంతో ఒప్పందాల నిమిత్తం ఈ నెల 8, 9,10 తేదీలలో భారత్ లో చేస్తున్న పర్యటనను నిరసిస్తూ పౌర ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు టి శ్రీరామ్మూర్తి, మానవ హక్కుల వేదిక ప్రతినిధి ప్రొఫెసర్ సుధా, ఐ యఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు యం. వెంకటేశ్వర్లు, పౌర ప్రజాసంఘాల వేదిక సమన్వయకర్త పి చంద్రశేఖర్ మాట్లాడారు