ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నవీపేట మండలం సిరన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. లబ్దిదారులను కలిసి, ఇంటి నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. గ్రామంలో 93 మందికి ఇళ్లు మంజూరు కాగా, 69 గ్రౌండింగ్ అయ్యాయని, 12 ఇండ్లు స్లాబ్ దశలో ఉన్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మిగతా 24 మంది కూడా ఇళ్లను నిర్మించుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.