సర్కారు దవాఖానాల్లో అందించే వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం కల్పించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. అన్ని వసతి సౌకర్యాలతో పాటు, వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లు అవుతుందన్నారు. కోస్గి పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, రక్త పరీక్షల గది, మెయిల్, ఫిమేల్, చిన్నపిల్లల వార్డులతో పాటు రక్త పరీక్షల గది, ఎక్స్ రే, ల్యాబ్ గదులను ఆమె పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకు