రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలతోపాటు 108 నైవేద్యాలు ఆ లంబోదారునికి సమర్పిస్తూ.. భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. కుంకుమార్చన పూజలు,శివార్చన,మహా లింగార్చన,పడి పూజ, గణపతి హోమం,దీపారాధన,అన్నదాన వితరణ కార్యక్రమాలతో పాటు పలు మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ భక్తి భావాన్ని పెంపొందిస్తున్నారు. తీరొక్క రూపాల్లో గణనాథులు భక్తులకు దర్శనమిస్తున్నారు. అందరినీ చల్లంగా చూడాలని బుధవారం పలు మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేస్తూ స్వామివారిని కోరుకుంటున్నారు మహిళ భక్తులు.