అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని హనిమరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఈనెల మూడున రోడ్డు ప్రమాదానికి గురైన సొల్లాపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మి (40) అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని బెలుగుప్ప ఎస్ఐ శివ ఆదివారం రాత్రి 8 గంటలకు పేర్కొన్నారు. అనారోగ్యానికి గురైన మహిళ నాగలక్ష్మి అనంతపురం లో వైద్య పరీక్షలు చేయించుకుని ఆటోలో బంధువులు కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి వస్తుండగా హనిమ రెడ్డిపల్లి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది అన్నారు. మృతురాలు భర్త ఆదినారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ పేర్కొన్నారు.