పెద్దాపురం మున్సిపాలిటీకి పరిధిలో బారు కేటాయింపు లైసెన్సు గడువు ఆగస్టు 26 కు ఉందని జిల్లాఎక్సైజ్ సూపరింటెండెంట్ M.కృష్ణకుమారి తెలిపారు. గురువారం పెద్దాపురంలో CI దుర్గా అర్జున్ రావుతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.బారుకు అప్లికేషన్ దాఖలకు చేసేందుకు ఆఖరు తేదీ ఈనెల 26 అని,కనీసం 4 అప్లికేషన్లు వస్తే లాటరీ తీస్తామన్నారు. అప్లికేషన్ ఫీజు రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలని తెలిపారు. లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలని,6వాయిదాల్లో కట్టొచ్చని అన్నారు.మూడేళ్లు పాటు లైసెన్స్ ఉంటుందని,ఫీజు ప్రతి ఏడాది 10 % ఫీజు పెరుగుతుందని అన్నారు. బారు పని చేసే వేళలు ఉ.10 గంటల రా.12 గంటల వరకు.