నగరంలోని టీఎన్జీవోస్ భవన్లో విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన గోపాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసిపి నాగేంద్ర చారితో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసిపి నాగేంద్ర చారి మాట్లాడుతూ గోపాలకృష్ణ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతగానో కృషి చేశాడని కృషికి తగ్గ ఫలితం లభించిందని అన్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును దక్కించుకున్న గోపాలకృష్ణ మునుముందు జాతీయస్థాయి అవార్డును సొంతం చేసుకోవాలని ఆయన కోరారు.