మండల కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాల వైద్యులపై మండిపడ్డ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విధులు నిర్వహిస్తున్న వైద్యులు మరియు సిబ్బంది పట్ల ఆగ్రహం అసహనం వ్యక్తం చేశారు విధుల పట్ల ఆలస్యత కనపరుస్తున్నారని పలుమార్లు హెచ్చరించినప్పటికీ మీలో మార్పు రాలేదని ఇదే చివరి అవకాశం గా వినియోగించుకొని మార్పు చెందకపోతే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని వేరే ప్రాంతానికి పంపించి కొత్త స్టాప్ ని ఇక్కడికి పిలిపించాల్సి వస్తుందని హెచ్చరించారు జిల్లాలో ఉన్న ప్రతి ప్రభుత్వ వైద్యశాలతో పోల్చుకుంటే బూర్గంపాడు ప్రభుత్వ వైద్యశాల పనితీరు గుండు సున్నా లా ఉందని అన్నారు