యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామ పాలన అధికారులతో సమావేశాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుధవారం నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ గ్రామాల్లోని సమస్యలను వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రజా పాలన కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో మండల తహసిల్దార్ ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శులు గ్రామ పాలన అధికారులు తదితరులు పాల్గొన్నారు.