శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలంలో అర్వేడు పెదయ్య స్వామి జల్ది పూజ, ఎల్లమ్మ సాగు మహోత్సవం ఈరోజు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ సైతం వస్తుండడంతో పోలీసులు గోరంట్ల మాధవ్ ను వేడుకలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. గోరంట్ల మాధవ్ పోలీసులను ప్రతిఘటించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మాధవ్ కు మద్దతుగా గ్రామంలోని యువత జై జగన్ అంటూ నినాదాలు చేయడంతో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని ధర్మవరం టూ టౌన్