బాల్కొండ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీఅధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలసీతారామన్, ఎంపీ అరవింద్ ల చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా మండలాధ్యక్షులు మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజల శ్రేయస్సు కోసం జీఎస్టీ తగ్గించడం జరిగిందన్నారు. ఈ తగ్గింపు వల్ల పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రతి కుటుంబంలో రోజు వాడే నిత్యావసర వస్తువుల తో పాటు, విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ ను మొదలుకొని వ్యవసాయ దారులకు ఆటోమొబైల్, పేస్టిసైడ్స్, ఎరువుల రంగానికి మేలు జరుగుతుందని అన్నారు.