ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఉరేసుకుని యువతి మృతి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన మూలకలచెరువు మండలంలో ఆదివారం సాయంత్రం వెలుగు చూసింది. ఎస్సై నరసింహుడు, మృతురాలి కుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని దేవలచెరువుకు చెందిన మేఘం రాజు, ప్రశాంతి దంపతుల కుమార్తె మహిమ జ్యోతి 16తో పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన ఓ వ్యక్తితో నెలరోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఆదివారం ఆ యువతి ఉరేసుకుని మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు...