టీపిసిసి అద్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజా స్పందన లేని జనహిత పాదయాత్ర చేయడం హాస్యస్పదం అని బీజేపి నాయకులు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం 5గంటలకు కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏ నాయకులైనా డే సమయంలో ఎండలో యాత్రలు చేసి ప్రజలవద్దకు పోయి ప్రజా సమస్యలు తెలుసుకుంటరని మహేష్ కుమార్ గౌడ్ మాత్రం చీకటి పడ్డాక యాత్ర చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉందని...అసలు ఇదేం యాత్రో అర్థం కావడం లేదని ఎద్దేవ చేశారు. ప్రజలు ఎవరిని కలవకుండా వాకింగ్ లా యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.