మహబూబాబాద్ పట్టణంలో మార్వాడిలు గో బ్యాక్ అంటూ సెల్ ఫోన్ దుకాణలను ముసివేసి నల్ల బ్యాడ్జిలు ధరించి సెల్ ఫోన్ దుకాణదారులు శుక్రవారం మధ్యాహ్నం 12:00 లకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.. అయితే సెల్ ఫోన్ దుకాణదారులు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని 50 మంది వ్యక్తులను టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తహసీల్దార్ ముందు వారిని బైండొవర్ చేసారు.. పట్టణంలో ఎవరైనా అనుమతి లేకుండా కార్యక్రమాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.