సైబర్ నేరగాళ్ల మోసానికి గురైన ఓ మహిళ 6 లక్షల 37 వేల రూపాయలు పోగొట్టుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ గురువారం సాయంత్రం తెలిపారు. ఈ మేరకు ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మందమర్రికి చెందిన మహిళ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో THAW and REPAIR ప్రకటన చూసి పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మి, సంబంధిత టెలిగ్రామ్ యాప్లో చేరింది. మొదటగా బాధితురాలి ఖాతాలో రూ.5 వేలు జమైనట్లు చూపించారు. సైబర్ నేరగాళ్లు చెప్పినట్టుగా 6,37,000 పెట్టుబడి పెట్టి మోసపోయింది.