మందమర్రి ఏరియాలోని రాజీవ్ నగర్ శ్రీ బాల గణేష్ మండలి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్సై రాజశేఖర్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసులు అందరూ తమ కాలనీ సురక్షితంగా ఉండాలని ఎలాంటి అవాంఛన సంఘటన జరిగిన కూడా రికార్డు కావాలనే మంచి ఉద్దేశంతో 9 కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఒక కెమెరా ఉందంటే 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. ప్రతి కాలనీలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ శాఖ తరపు కోరుతున్నామన్నారు. రాజీవ్ నగర్ శ్రీ బాల గణేష్ మండల కమిటీకి పోలీస్ శాఖ తరపున అభినందనలు తెలిపారు.